ఆరోగ్య అలవాట్లతో గుండెజబ్బులకు చెక్‌ పెట్టవచ్చు

ABN , First Publish Date - 2021-11-09T05:42:51+05:30 IST

జీవన విధానాలు, ఆరోగ్యపు అలవాట్లు మార్చుకోవటం ద్వారా ఎవరికి వారు తమ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకొని ఎటువంటి గుండెజబ్బులు రాకుండా చూసుకోవచ్చని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ ఆర్‌.మురళీబాబురావు పేర్కొన్నారు.

ఆరోగ్య అలవాట్లతో గుండెజబ్బులకు చెక్‌ పెట్టవచ్చు
డాక్టర్‌ మురళీబాబురావును సత్కరిస్తున్న అవగాహన సంస్థ సభ్యులు

ప్రముఖ కార్డియాలజిస్టు మురళీబాబూరావు

గుంటూరు, నవంబరు 8: జీవన విధానాలు, ఆరోగ్యపు అలవాట్లు మార్చుకోవటం ద్వారా ఎవరికి వారు తమ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకొని ఎటువంటి గుండెజబ్బులు రాకుండా చూసుకోవచ్చని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ ఆర్‌.మురళీబాబురావు పేర్కొన్నారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఆరోగ్యసభలో ఆయన ప్రసంగించారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉంటేనే అన్ని అవయువాలకు రక్తసరఫరా బాగా జరిగి మనిషి ఆరోగ్యంగా ఉంటాడన్నారు. గుండె జబ్బులకు ముఖ్య కారణాలు మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌, ఊబకాయం, కొలెసా్ట్రల్‌ లాంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. రోజూ తీసుకొనే ఆహారం మితంగా తీసుకొని, వ్యాయామం చేస్తూ తగు పరీక్షలతో మధుమేహవ్యాధి తీవ్రతను గుర్తించాలన్నారు. మధుమేహవ్యాధిని నియంత్రించుకుంటూ గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, వెంకటరావు, సుబ్బారెడ్డి తదితరులున్నారు. 


Updated Date - 2021-11-09T05:42:51+05:30 IST