కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం

ABN , First Publish Date - 2021-05-22T04:45:16+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను గుర్తించి అధిగమించటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఈ పరిస్థితుల్లో దేశంలో కరోనా మూడోవేవ్‌లోకి వెళ్ళకుండా శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవాలని ప్రముఖ యోగాచార్యులు అచ్యుత ఇందుశేఖర్‌ పేర్కొన్నారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఇందుశేఖర్‌ తదితరులు

గుంటూరు, మే 21: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను గుర్తించి అధిగమించటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఈ పరిస్థితుల్లో దేశంలో కరోనా మూడోవేవ్‌లోకి వెళ్ళకుండా శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవాలని ప్రముఖ యోగాచార్యులు అచ్యుత ఇందుశేఖర్‌ పేర్కొన్నారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో శుక్రవారం జరిగిన చర్చలో ఆయన  మాట్లాడుతూ ఏప్రిల్‌ 15 నుంచి రోజు రెండు, మూడు లక్షలకు పైగా దేశంలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయని, ప్రభుత్వాలు చూపిస్తున్న మృతుల సంఖ్యను పదిరెట్లు పెంచుకోవచ్చని అనేక సంస్థలు తెలియజేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ కరోనా విజృంభణకు ప్రధాన కారణం ప్రభుత్వాల వైఫల్యమేనని విమర్శించారు. కార్యక్రమంలో ఇంజనీర్‌ ఎన్‌.సదాశివం, సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు తదితరులున్నారు.

 

Updated Date - 2021-05-22T04:45:16+05:30 IST