వివాహిత ఆత్మహత్య యత్నం

ABN , First Publish Date - 2021-03-22T05:43:11+05:30 IST

మండలంలోని మూల్పూరుకు చెందిన వివాహిత కొక్కిలగడ్డ మంజుల ఆదివారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

వివాహిత ఆత్మహత్య యత్నం

అధికార పార్టీ నేత వేధింపులే కారణం!

అమృతలూరు, మార్చి 21: మండలంలోని మూల్పూరుకు చెందిన వివాహిత కొక్కిలగడ్డ మంజుల ఆదివారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. వైసీపీ మండల సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ సుద్దపల్లి స్వప్నమిత్ర వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. స్వప్నమిత్ర గత కొంతకాలంగా ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడుతూ లైగింకంగా వేధిస్తున్నాడని తెలిపింది. శనివారం ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడి బెదిరించాడని పేర్కొంది. ఫ్యాన్‌కు ఉరివేసుకున్న ఆమెను తల్లి గమనించి వెంటనే తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. చికిత్స  పొందుతున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గిరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వప్నమిత్ర నుంచి తనకు ప్రాణహాని ఉందని మంజుల తెలిపింది.  

Updated Date - 2021-03-22T05:43:11+05:30 IST