నర్సుపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2021-10-14T06:11:40+05:30 IST

స్థానిక పలకలూరురోడ్డులోని ఓ ఆస్పత్రిలోకి ఈ నెల 11న అర్ధరాత్రి నర్సుపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు దిశ ఎస్‌ఐ జె.శ్రీనివాసరావు తెలిపారు.

నర్సుపై అత్యాచారయత్నం

నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు

గుంటూరు, అక్టోబరు 13: స్థానిక పలకలూరురోడ్డులోని ఓ ఆస్పత్రిలోకి ఈ నెల 11న అర్ధరాత్రి నర్సుపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు దిశ ఎస్‌ఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. అగంతకుడు గేటు దూకి లోనికి ప్రవేశించగా రిసెప్షనలో ఉన్న నర్సు ప్రశ్నించగా బంధువు ఆస్పత్రిలో ఉన్నట్లు చెప్పాడు. దీంతో ఆమె లైటు వేసేందుకు లోనికి వెళ్లగా నిందితుడు లోనికి వెళ్లి అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె తప్పించుకుని జనరల్‌ వార్డులోకి పరుగు తీసింది. జనరల్‌ వార్డులో ఉన్న రోగులు, స్థానికులు వచ్చి ప్రశ్నించగా తన పేరు మాషాడ వెంకట ఆదినారాయణ అలియాస్‌ వాసు అని, తాను ఆస్పత్రి వెనుక వీధిలో నివాసం ఉంటున్నట్టు చెప్పాడు. అయితే వారు ఆదినారాయణను పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పారిపోయాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది బాధితురాలిని జీజీహెచకు తరలించారు. 12న ఆమె దిశ పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేయగా పోలీసులు ఆదినారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఆదినారాయణ 2012లో నల్లపాడు పోలీస్‌స్టేషన పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని ఎస్‌ఐ తెలిపారు. 1997లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదైందన్నారు. 

     

Updated Date - 2021-10-14T06:11:40+05:30 IST