ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-08-22T05:17:51+05:30 IST

తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే ఆందోళనతో ఓ ప్రేమ జంట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివారం దాచేపల్లి మండలం భట్రుపాలెం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో జరిగింది.

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగవర్థిని, శ్రీకాంత

గుడిలో వివాహం చేసుకున్న గంటల్లోనే..

 దాచేపల్లి, ఆగస్టు21: తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే ఆందోళనతో ఓ ప్రేమ జంట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివారం దాచేపల్లి మండలం భట్రుపాలెం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. నడికుడి గ్రామానికి చెందిన శ్రీకాంత ఎంబీఏ, గురజాల మండలం అంబాపురానికి చెందిన నాగవర్థని డిగ్రీ చదువుతున్నారు. ఇద్దరివీ వేర్వేరు సామాజిక వర్గాలు. ఏడాదిన్నరగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కాగా పెద్దలు వారి వివాహానికి అంగీకరించలేదు.. దీంతో శనివారం నడికుడి దుర్గాభవాని ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే  పొలాల వద్దకు వెళ్లి  పురుగుమందు తాగి కుటుంబసభ్యులకు ఫోన ద్వారా తెలియజేశారు. వెంటనే వారిని గుంటూరు జీజీహెచకు తరలించారు. దాచేపల్లి ఎస్‌ఐ బాలనాగిరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. 


Updated Date - 2021-08-22T05:17:51+05:30 IST