కర్మకాండలకు వచ్చి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-06-21T05:43:16+05:30 IST

బంధువు కర్మకాండలలో పాల్లొనే నిమిత్తం వచ్చి ప్రమాదవశాత్తు కాలువలో వ్యక్తి మునిగి చనిపోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

కర్మకాండలకు వచ్చి వ్యక్తి మృతి
వెలికితీసిన మృతదేహం వద్ద బంధువుల రోదనలు

మంగళగిరి, జూన్‌ 20: బంధువు కర్మకాండలలో పాల్లొనే నిమిత్తం వచ్చి ప్రమాదవశాత్తు కాలువలో వ్యక్తి మునిగి చనిపోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సత్తెనపల్లికి చెందిన గంజి లక్ష్మయ్య(42)  మంగళగిరిలో తన బంధువొకరు చనిపోగా ఆదివారం నాడు అతని కర్మకాండలలలో పాల్గొనే నిమిత్తం వచ్చాడు. గుంటూరు చానల్‌ వద్ద సంప్రదాయ తంతు కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మిగతా బంధువులతో కలిసి గుంటూరు చానల్‌లో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. సమాచారాన్ని అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని లక్ష్మయ్య మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-06-21T05:43:16+05:30 IST