గుండెపోటుతో ఏఎస్‌ఐ అక్బర్‌ మృతి

ABN , First Publish Date - 2021-08-11T05:21:19+05:30 IST

పాతగుంటూరు ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న షేక్‌ అక్బర్‌(58) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

గుండెపోటుతో ఏఎస్‌ఐ అక్బర్‌ మృతి
ఏఎస్‌ఐ షేక్‌ అక్బర్‌

గుంటూరు(కార్పొరేషన), ఆగస్టు 10: పాతగుంటూరు ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న షేక్‌ అక్బర్‌(58) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా ఆయన పాతగుంటూరు పోలీస్‌ స్టేషనలో విధులు నిర్వహిస్తున్నారు. గత రాత్రి నైట్‌ డ్యూటీలో భాగంగా రక్షక వాహనంలో తిరగుతుండగా గుండెపోటు వచ్చింది. కాకానిరోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిచంగా అప్పటికే  మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అక్బర్‌ మృతిపట్ల పాతగుంటూరు సీఐ కె.వాసు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-11T05:21:19+05:30 IST