మీ సభకో నమస్కారం..

ABN , First Publish Date - 2021-10-20T05:39:16+05:30 IST

తాడికొండలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆసరా సభ జరుగుతుండగానే నుంచి డ్వాక్రా మహిళలు అక్కడినుంచి వెళ్లిపోయారు.

మీ సభకో నమస్కారం..
మహిళలు సభ మధ్యలో వెళ్లిపోవటంతో ఖాళీఅయిన కుర్చీలు

ఆసరా సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన మహిళలు

యానిమేటర్లు అడ్డుకున్నా.. వినని వైనం

తాడికొండ, తుళ్లూరు, అక్టోబరు 19: తాడికొండలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆసరా సభ జరుగుతుండగానే నుంచి డ్వాక్రా మహిళలు అక్కడినుంచి వెళ్లిపోయారు. యానిమేటర్లు, వైసీపీ నాయకులు ఎంతచెప్పినా వినలేదు. దీంతో సభాప్రాంగణలోని కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి.  

వైఎస్సార్‌ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేయటానికి ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో తాడికొండ బీఎస్‌ఎస్‌బీ కళాశాలలో మంగళవారం పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు తాడికొండ, తుళ్లూరు మండలాల నుంచి డ్వాక్రా మహిళలను తరలించారు. ఈ మీటింగ్‌కి రాకపోతే ఆసరా డబ్బు రాదంటూ బెదిరించి మరీ తీసువెళ్లినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. అక్కడ టెంట్లు కూడా వేయకపోవడంతో వచ్చినవారు ఎండకు ఇబ్బందిపడ్డారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటకే మహిళలు ఇళ్లకు వెళ్లిపోవటానికి సిద్ధపడ్డారు. వారిని వెళ్లనీయకుండా వైసీపీ నేతలు, డ్వాక్రా సీసీలు, యానిమేటర్లు అడ్డుకున్నారు. మైక్‌లో పదేపదే కోరారు. కళాశాల గేటును మూసివేశారు. దీంతో మహిళలు వారితో వాగ్వాదానికి దిగారు. ఎంత వారించి గేటును తోసుకుంటూ బయటకు వెళ్లిపోయారు.  


Updated Date - 2021-10-20T05:39:16+05:30 IST