చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2021-08-10T05:30:00+05:30 IST

నల్లపాడు పోలీస్‌స్టేషన పరిధిలో వరుసగా జరుగుతున్న చోరీలకు పోలీసులు చెక్‌ పెట్టారు. నల్లపాడు సీఐ ప్రేమయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ సీహెచ కిషోర్‌ ఓ మైనర్‌ సహా ఇద్దరిని అరెస్టు చేశారు.

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సౌత డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, సీఐ ప్రేమయ్య, ఎస్‌ఐ కిషోర్‌, వెనుక నిందితుడు

గుంటూరు, ఆగస్టు 10: నల్లపాడు పోలీస్‌స్టేషన పరిధిలో వరుసగా జరుగుతున్న చోరీలకు పోలీసులు చెక్‌ పెట్టారు. నల్లపాడు సీఐ ప్రేమయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ సీహెచ కిషోర్‌ ఓ మైనర్‌ సహా ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం సౌత డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జెస్సీ ప్రశాంతి నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. స్వర్ణభారతినగర్‌కు చెందిన తాడిశెట్టి జాన హోసన్న, 17 సంవత్సరాల యువకుడు కలిసి సమీప ప్రాంతాల్లో కొద్ది రోజులుగా చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో అరండల్‌పేట, పట్టాభిపురం పోలీసులు జాన హోసన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా బెయిల్‌పై వచ్చాడు. ఆ తర్వాత మైనర్‌ అయిన తన స్నేహితుడితో కలిసి నగర శివారు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేని ప్రదేశాలు, ఇళ్లను ఎంపిక చేసుకుని రాత్రి వేళ చోరీలకు పాల్పడ్డారు. సౌత డీఎస్పీ జెస్సీ ప్రశాంతి ఆదేశాల మేరకు నల్లపాడు సీఐ ప్రేమయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ సీహెచ కిషోర్‌, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, ఆర్‌.ఆంజనేయులు రంగంలోకి దిగి చోరీకి గురైన సెల్‌ఫోన్ల లొకేషన ఆధారంగా నిందితుల ఆనవాళ్లను గుర్తించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ  ఇటీవల అంకిరెడ్డిపాలెం సమీపంలో జరిగిన దారి దోపిడీ ఘటనను కూడా త్వరలోనే చేధిస్తామన్నారు. 


Updated Date - 2021-08-10T05:30:00+05:30 IST