గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2021-12-29T05:10:51+05:30 IST

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులను పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు.

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ రాజశేఖరరెడ్డి, వెనుక నిందితులు

కారు, మూడు కిలోల గంజాయి సీజ్‌ 

గుంటూరు, డిసెంబరు 28:  గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులను పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ రాజశేఖరరెడ్డి నిందితులను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలేనికి చెందిన అన్నపురెడ్డి మహేశ్వరరెడ్డి ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. గంజాయికి అలవాటు పడిన అతను అరకు వెళ్లి మూడు కిలోల గంజాయి తీసుకువచ్చాడు. తన స్నేహితులైన పిట్టలవానిపాలెం మండలం కోమలి గ్రామానికి చెందిన ఆరె రాజశేఖరరెడ్డి, ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడుకు చెందిన క్రిస్టిపాటి శివనాగిరెడ్డిలను సంప్రదించి తన వద్ద ఉన్న గంజాయి విక్రయించేందుకు సహకరించాలని కోరగా ఇరువురు అంగీకరించారు. గంజాయి విక్రయించేందుకు వెళుతుండగా ఎస్‌ఐ ఏక్‌నాథ్‌కు అందిన సమాచారంతో సిబ్బందితో వెళ్లి గుంటూరులోని కృష్ణగర్‌లో ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి మూడు కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ రాజశేఖరరెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-12-29T05:10:51+05:30 IST