హిజ్రాను హత్య చేసిన నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-08-20T05:41:41+05:30 IST

స్థానిక వెంకటాద్రి పేటలో ఈ నెల 16న రాత్రి చంద్రశేఖర్‌ అలియాస్‌ చందన (32) అనే హిజ్రాను హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు కొత్తపేట సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

హిజ్రాను హత్య చేసిన నిందితుడి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాసరెడ్డి, వెనుక నిందితుడు క్లెమంత

గుంటూరు, ఆగస్టు 19: స్థానిక వెంకటాద్రి పేటలో ఈ నెల 16న రాత్రి చంద్రశేఖర్‌ అలియాస్‌ చందన (32) అనే హిజ్రాను హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు కొత్తపేట సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. గురువారం స్టేషనలో ఏర్పాటు చే సిన విలేకర్ల సమావేశంలో నిందతుడు క్లెమంత్‌ ను మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలు వెల్లడించారు. వెంకటాద్రిపేటకు చెందిన ఆటోడ్రైవర్‌ క్లెమంతను చందన తన భర్తగా ప్రచారం చేస్తుండటంతో వారి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత క్లెమంత్‌ హైదరాబాద్‌ వెళ్ళి ఉంటున్నాడు. ఇటీవల గుంటూరుకు వచ్చిన క్లెమంతను 16న రాత్రి హిజ్రా చందన గతంలో లాగే మళ్ళీ కలిసుందామని వెంట పడటంతో  విసుగు చెంది హత్య చేశాడు. ఈ కేసులో నిందతుడిని కోర్టులో హాజరు పరిచామని సీఐ తెలిపారు.  

 

Updated Date - 2021-08-20T05:41:41+05:30 IST