ఉద్యోగులు సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం

ABN , First Publish Date - 2021-10-22T05:16:48+05:30 IST

ఉద్యోగులు సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఏపీసీటీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.

ఉద్యోగులు సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం
ప్రమాణస్వీకారం చేస్తున్న కిషోర్‌, నూతన కార్యవర్గ సభ్యులు

ఏపీసీటీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ

గుంటూరు, అక్టోబరు 21: ఉద్యోగులు  సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఏపీసీటీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఇటీవల సీటీశాఖ నరసరావుపేట డివిజన్‌కు సంబంధించి ఇటీవల జరిగిన గుర్తింపు ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్‌ కిషోర్‌కుమార్‌ ప్యానల్‌ ప్రమాణస్వీకారం అరండల్‌పేటలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ  ఇప్పటికీ ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నాయని, వాటిపై త్వరలో ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించే చర్యలు తీసుకుంటామన్నారు. నరసరావుపేట డివిజన్‌ జాయింట్‌ కమిషనర్‌ నాగజ్యోతి మాట్లాడుతూ విధి నిర్వహణలో అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో మెలగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆస్కార్‌రావు, రామలింగం, మురళీకృష్ణ, సత్యనారాయణ, రమేష్‌కుమార్‌, చాంద్‌బాషా, నరసింగరావు, మెహర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T05:16:48+05:30 IST