మహిళలకు తక్కువ వడ్డీకే సహకార రుణాలు

ABN , First Publish Date - 2021-10-22T05:14:12+05:30 IST

మహిళలకు తక్కువ వడ్డీకే సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం రుణాలిస్తున్నట్లు ఆప్‌కాబ్‌ చైర్మన మల్లెల ఝాన్సీరాణి తెలిపారు.

మహిళలకు తక్కువ వడ్డీకే సహకార రుణాలు
చెక్కులు పంపిణీ చేస్తున్న ఝాన్సీరాణి, లాలుపురం రాము తదితరులు

ఆప్‌కాబ్‌ చైర్మన మల్లెల ఝాన్సీరాణి

గుంటూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):  మహిళలకు తక్కువ వడ్డీకే సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం రుణాలిస్తున్నట్లు ఆప్‌కాబ్‌ చైర్మన మల్లెల ఝాన్సీరాణి తెలిపారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో గురువారం డ్వాక్రా సంఘాలకు రూ.50 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలిస్తున్నట్లు చెప్పారు. సహకార రుణాలను సక్రమంగా ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన లాలుపురం రాము, పాలకవర్గసభ్యులు కోటా హరిబాబు, ఏడుకొండలు, వెంకటేశ్వరమ్మ, ఆంజనేయులు, ఆప్కాబ్‌ డీజీఎం సత్యవతి, సీఈవో కృష్ణవేణితో పాటు రాజారామ్‌రెడ్డి, భాను, ఫణి, అజయ్‌కిషోర్‌, మాధవి తదితరులు పాల్గొన్నారు.

గ్రోశక్తి ఎరువుతో మొక్కలకు మేలు 

కోరమండల్‌ గ్రోశక్తిప్లస్‌ కాంప్లెక్స్‌ ఎరువు మొక్కలకు మేలు చేస్తుందని ఆప్‌కాబ్‌ చైర్మన ఝాన్సీరాణి తెలిపారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో కాంప్లెక్స్‌ ఎరువును ఆవిష్కరించారు. కార్యక్రమంలో కోరమండల్‌ రీజనల్‌ హెడ్‌ చక్రవర్తి, జోనల్‌ మేనేజర్‌ హరి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T05:14:12+05:30 IST