రేపు బంగ్లాదేశ స్మారక విమోచన దినోత్సవం

ABN , First Publish Date - 2021-10-28T05:39:20+05:30 IST

బంగ్లాదేశ స్మారక విమోచన దినోత్సవం గుంటూరు రాజీవ్‌గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించనున్నట్లు ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి తెలిపారు.

రేపు బంగ్లాదేశ స్మారక విమోచన దినోత్సవం

ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి

గుంటూరు, అక్టోబరు 27 : బంగ్లాదేశ స్మారక విమోచన దినోత్సవం గుంటూరు రాజీవ్‌గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించనున్నట్లు ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి తెలిపారు. రాజీవ్‌గాంధీభవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పట్లో ఇందిరాగాంధీ హయాంలో బంగ్లాదేశ విమోచన జరిగిందని గుర్తుచేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు షేక్‌ ఉస్మాన్‌, కరీమ్‌, గడ్డం పాల్‌విజయ్‌కుమార్‌, బొట్ల బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T05:39:20+05:30 IST