ఒకే రాజధాని అమరావతే ఉండాలి

ABN , First Publish Date - 2021-11-23T06:12:15+05:30 IST

‘ఒకే రాష్ట్ర ఒకే రాజధాని అది అమరావతే ఉండాలని తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీ సమర్ధించింది... దానికే ఇప్పటికీ కట్టుబడి ఉంద’ని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి పేర్కొన్నారు.

ఒకే రాజధాని అమరావతే ఉండాలి
మాట్లాడుతున్న మస్తాన్‌వలి, మద్దిరెడ్డి తదితరులు

ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి

గుంటూరు, నవంబరు 22: ‘ఒకే రాష్ట్ర ఒకే రాజధాని అది అమరావతే ఉండాలని తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీ సమర్ధించింది... దానికే ఇప్పటికీ కట్టుబడి ఉంద’ని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి పేర్కొన్నారు. గుంటూరు రాజీవ్‌గాంధీ భవన్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని అమరావతి ఉండాల్సిందేనని ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ రాజధాని రైతులకు మద్దతుగా ఉద్యమాల్లో సంఘీభావం తెలిపిందని గుర్తుచేశారు. అయితే సీఎం  జగన్‌మోహనరెడ్డి రాజధానిపై ప్రజల్లో అయోమయం సృష్టిస్తూ, మూడు రాజధానులంటూ ఇరుప్రాంత ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు ప్రజలకు అనుగుణంగా ఎక్కడైనా ఉండవచ్చని, అయితే అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిపై కూడా పునర్విభజనచట్టంలో స్పష్టంగా పేర్కొన్నారన్నారు. రాజధాని నిర్మాణం బాధ్యత కూడా కేంద్రానిదేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగనమోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు షేక్‌ ఉస్మాన్‌, నాయకులు చుక్కా చంద్రపాల్‌, పాల్‌విజయ్‌కుమార్‌, బ్రహ్మం, మోషే, కరీం, సుభాని తదితరులున్నారు. 


Updated Date - 2021-11-23T06:12:15+05:30 IST