హెచ్‌టీ వినియోగదారులకు కొవిడ్‌ రాయితీలు కల్పించాలి

ABN , First Publish Date - 2021-01-21T05:24:13+05:30 IST

‘కరోనా సమయంలో లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డాం...ఆర్థికంగా నష్టపోయాం...హెచ్‌టీ వినియోగదారులకు ఛార్జీలు తగ్గించటంతో పాటు కొవిడ్‌-19 రాయితీలు తమకూ కల్పించాలని పలువురు హైటెన్షన్‌ (హెచ్‌టీ) విద్యుత్‌ వినియోగదారులు ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ను కోరారు.

హెచ్‌టీ వినియోగదారులకు కొవిడ్‌ రాయితీలు కల్పించాలి

ముగిసిన ఏపీఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ 

గుంటూరు, జనవరి 20: ‘కరోనా సమయంలో లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డాం...ఆర్థికంగా నష్టపోయాం...హెచ్‌టీ వినియోగదారులకు ఛార్జీలు తగ్గించటంతో పాటు కొవిడ్‌-19 రాయితీలు తమకూ కల్పించాలని పలువురు హైటెన్షన్‌ (హెచ్‌టీ) విద్యుత్‌ వినియోగదారులు ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ను కోరారు. విద్యుత్‌ పంపిణీ సంస్థల 2021-22 చార్జీల టారిఫ్‌ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ బుధవారంతో ముగిసింది. ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి, టెక్నికల్‌ సభ్యుడు ఠాకూర్‌ రామ్‌సింగ్‌లు వైజాగ్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పొన్నూరు రోడ్డులోని విద్యుత్‌భవన్‌లో జరుగుతున్న వీడియోకాన్ఫరెన్స్‌కు చివరి రోజు హెచ్‌టీ వినియోగదారులు హాజరై తమ సమస్యలను వివరించారు. కరోనాతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చవిచూస్తున్న హెచ్‌టీ వినియోగదారులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరారు. సమావేశంలో గుంటూరు ఆపరేషన్‌ విభాగం ఎస్‌ఈ ఎం.విజయకుమార్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T05:24:13+05:30 IST