హైకోర్టులో పోలవరం నిర్వాసితుల పిల్ కొట్టివేత

ABN , First Publish Date - 2021-02-01T18:59:23+05:30 IST

పోలవరం నిర్వాసితుల సమస్యపై దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది.

హైకోర్టులో పోలవరం నిర్వాసితుల పిల్ కొట్టివేత

గుంటూరు: పోలవరం నిర్వాసితుల సమస్యపై దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే పోలవరంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని... విధానపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. అధికారులకు సమస్యను విన్నవించాక పరిష్కారం కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని హైకోర్టు పేర్కొంది. 

Updated Date - 2021-02-01T18:59:23+05:30 IST