రైతులది న్యాయపోరాటం

ABN , First Publish Date - 2021-10-31T05:35:03+05:30 IST

తమది న్యాయ పోరాటమని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని రాజధాని రైతులు పేర్కొన్నారు.

రైతులది న్యాయపోరాటం
పెదపరిమి రైతు ధర్నా శిబిరంలో ఆందోళనలుచేస్తున్న మహిళలు

683వ రోజుకు చేరుకున్న ఆందోళనలు 

తుళ్లూరు, అక్టోబరు 30: తమది న్యాయ పోరాటమని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని రాజధాని రైతులు పేర్కొన్నారు.  రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న ఉద్యమం శనివారంతో 683వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ పాద యాత్ర సమయంలో రాళ్ల దాడి జరుగుతుందని, శాంతి భద్రతల సమస్య తలెత్తుందని పోలీసులు ఉన్నత న్యాయస్థానం ముందు చెప్పటం హాస్యాస్పదమన్నారు. ముందే రాళ్ల దాడికి పఽథకం రచించారా.. అని   ప్రశ్నించారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. కాగా చింతలపూడికి చెందిన రావిపాటి ఉదయ్‌కుమార్‌, రైతుల పాదయాత్రకు తన వంతుగా రూ.2లక్షల విరాళం అందించారు. ఆ సొమ్మును అతని మిత్రులు చందనబాబు, పమిడి కమలాకర్‌ ద్వారా రైతు నేతలకు అందించారు. 


Updated Date - 2021-10-31T05:35:03+05:30 IST