మహాపాదయాత్రను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2021-11-01T05:17:28+05:30 IST

అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ, రైతులు తలపెట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

మహాపాదయాత్రను జయప్రదం చేయండి
సమావేశంలో ప్రసంగిస్తున్న జిల్లా టీడీపీ నేతలు

తెనాలి శ్రావణ్‌కుమార్‌

గుంటూరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ, రైతులు తలపెట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు  టీడీపీ గుంటూరు పార్లమెంటరీ  అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇనఛార్జ్‌లతో పాటు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విజభన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన చంద్రబాబు రాషా్ట్రనికి అమరావతి రూపంలో ఊపిరి అందించారని కొనియాడారు. నేడు 33వేల ఎకరాలు ఉదారంగా రాషా్ట్రనికి ఇచ్చిన అమరావతి రైతులపై సీఎం జగన కక్ష సాధిస్తున్నారన్నారని  ఆరోపించారు. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ తీసుకున్న ఆనాలోచిత నిర్ణయంతో ఇప్పటి వరకు 54మంది రాజధానికి భూమలు ఇచ్చిన రైతులు, కూలీలు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీపై అక్కసుతో రాజధానిని నాశనం చేసి జగన రాషా్ట్రన్ని పాతాళానికి నెట్టారన్నారు. జేఏసీ నేతలు పువ్వాడ సుధాకర్‌, పిడికిటి మల్లికార్జునరావు మాట్లాడుతూ రాజధాని ఆవశ్యకత ప్రజలందరికీ వివరించటమే మహాపాదయాత్ర ముఖ్య ఉద్ధేశమని తెలిపారు. సమావేశంలో తూర్పు, పశ్చిమ ఇనఛార్జ్‌లు మహ్మద్‌ నసీర్‌, కోవెలమూడి రవీంద్ర, అన్నాబత్తిని విజయలక్ష్మి, పోతినేని శ్రీనివాస్‌, హసనబాషా, కంచర్ల శివరామయ్య, నాయుడు ఓంకార్‌, కళ్లం రాజశేఖరరెడ్డి, రావిపాటి సాయికృష్ణ, మన్నవ వంశీకృష్ణ, ఈరంటి వరప్రసాద్‌, గుంటుపల్లి మధుసూదన తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-01T05:17:28+05:30 IST