అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-11-24T05:16:30+05:30 IST

గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి అల్లాడి జ్ఞానశ్రీ అన్నారు.

అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
శిక్షణలో మాట్లాడుతున్న జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ

జిల్లా మలేరియా అధికారి అల్లాడి జ్ఞానశ్రీ

వినుకొండటౌన, నవంబరు 23 : గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి అల్లాడి జ్ఞానశ్రీ అన్నారు. స్థానిక జాషువా కళాప్రాంగణంలో దోమల నివారణ, సీజనల్‌ వ్యాధులపై వైద్య, ఆరోగ్య సిబ్బందికి మంగళవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో నిల్వ ఉన్న నీటితో దోమలు వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని లార్వాలను గుర్తించి వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని  సూచించారు.   కార్యక్రమంలో వైద్యాధికారులు సయ్యద్‌ ఇబ్రహీం, భాస్కర్‌, వినుకొండ సబ్‌ యూనిట్‌ మలేరియా అధికారి ఎస్‌.వి.సుబ్బారావు, సీహెచవోలు, వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-24T05:16:30+05:30 IST