ప్రభుత్వ శాఖల్లో ఖాళీపోస్టులను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2021-11-23T06:16:01+05:30 IST

ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీచేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ సుభాని డిమాండ్‌చేశారు.

ప్రభుత్వ శాఖల్లో ఖాళీపోస్టులను భర్తీ చేయాలి
కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఏఐవైఎఫ్‌ నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన

గుంటూరు(తూర్పు), నవంబరు22: ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీచేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ సుభాని డిమాండ్‌చేశారు. ప్రభుత్వోద్యోగాలను భర్తీచేయాలంటూ సోమవారం ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని వనరులు అందుబాటులో ఉన్నా పరిశ్రమలు నెలకోల్పడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. జిల్లాకు మూలాధారమైన జిన్నింగ్‌ పరిశ్రమలు, జూట్‌ మిల్లు మూతపడటంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన విడుదల చేసి, జూట్‌మిల్లును పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషనకు తరలించారు. ధర్నాలో బందెల నాసర్‌జీ, వలీ, జంగాలచైతన్య, సాగర్‌, మార్క్‌, చినబాబు, కిరణ్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-23T06:16:01+05:30 IST