విద్యార్థులపై లాఠీచార్జీ అమానుషం

ABN , First Publish Date - 2021-11-09T05:45:53+05:30 IST

ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని పరిరక్షించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం అమానుషమని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహాంకాళి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులపై లాఠీచార్జీ అమానుషం
మోకాళ్ళపై నిల్చొని నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు


మోకాళ్ళపై నిలబడి  విద్యార్థిసంఘాల నిరసన

గుంటూరు (విద్య), నవంబరు 8: ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని పరిరక్షించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం అమానుషమని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహాంకాళి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని ఎస్‌బీఎన ఎయిడెడ్‌ కళాశాలను ప్రైవేటీకరించడాన్ని నిరసస్తూ విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు లాఠీచార్జీ చేశారని పేర్కొన్నారు. ఇందుకు నిరసన విద్యార్థి సంఘాల సంయుక్త కార్యచరణకమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, టీఎనఎస్‌ఎఫ్‌ తదితర విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో శంకరవిలాస్‌ సెంటర్‌లో మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తంచేశారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల్ని రక్షించాలని, జీవో నం  35, 42, 50లను రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు మనోజ్‌, టీఎనఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకుడు ధర్మతేజ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు నాసర్‌, సమీర్‌, భారత తదితరులు పాల్గొన్నారు. హిందూ కళాశాల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

 


Updated Date - 2021-11-09T05:45:53+05:30 IST