ఎయిడెడ్‌ విలీనం తక్షణమే నిలిపివేయాలి

ABN , First Publish Date - 2021-11-01T05:18:25+05:30 IST

రాష్ట్రంలో ఎయిడెడ్‌ పాఠశాలల్ని ప్రభుత్వంలో విలీనంచేసే ఆలోచనల్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రైవేటు ఎయిడెడ్‌ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజమెంట్స్‌ అసోసియేషన(ప్రాస్మా) నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎయిడెడ్‌ విలీనం తక్షణమే నిలిపివేయాలి
మాట్లాడుతున్న సంఘం నాయకులు అంజయ్య

గుంటూరులో ఆరు జిల్లాల యాజమాన్యాల సమావేశం

 గుంటూరు(విద్య), అక్టోబరు 31: రాష్ట్రంలో ఎయిడెడ్‌  పాఠశాలల్ని ప్రభుత్వంలో విలీనంచేసే ఆలోచనల్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రైవేటు ఎయిడెడ్‌ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజమెంట్స్‌ అసోసియేషన(ప్రాస్మా) నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం పాత గుంటూరులోని యాదవ ఉన్నత పాఠశాలలో గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు చెందిన ఎయిడెడ్‌ స్కూల్స్‌ యాజమాన్యాల ఆధ్వర్యంలో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాస్మా వ్యవస్థాపక అధ్యక్షుడు మైలా ఆంజయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎయిడెడ్‌ పాఠశాలల్ని బలవంతంగా విలీనం చేసుకోబోమని సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెబుతున్నా విద్యాశాఖ పట్టించుకోవడం లేదన్నారు.  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గత 20 సంవత్సరాలుగా ఎయిడెడ్‌ పాఠశాల్లో పోస్టులు భర్తీ చేయకుండా, పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోయారని చెప్పడం అన్యామన్నారు.  రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షులు శ్యామ్యూల్‌ మోజెస్‌ మాట్లాడుతూ ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం విషయంలో విద్యాశాఖ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జునరావు, దాసరి వెంకటసుబ్బారావు, కోశాధికారి యుగంధర్‌,  జిల్లా అధ్యక్షులు దాసరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T05:18:25+05:30 IST