బాపట్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయం

ABN , First Publish Date - 2021-02-27T05:57:29+05:30 IST

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని బాపట్లలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి తెలిపారు.

బాపట్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయం
ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించిన క్రీడాకారులతో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి

వ్యవసాయ క్రీడల ముగింపు సభలో డిప్యూటీ స్పీకర్‌ 

బాపట్ల, ఫిబ్రవరి 26: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని బాపట్లలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి తెలిపారు. వర్సిటీ పరిధిలోని బోధన, బోధనేతర సిబ్బందికి నిర్వహిస్తున్న క్రీడా, సాంస్కృతిక పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా డాక్టర్‌ బీవీ నాథ్‌ ఆడిటోరియంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ వర్సిటీ స్థాపనకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. బాపట్ల వ్యవసాయ కళాశాల సమాజాభివృద్ధికి దోహదపడే వ్యక్తులను అందించిందని తెలిపారు. వర్సిటీ రిజిస్ర్టార్‌ గిరిధర్‌కృష్ణ మాట్లాడుతూ పోటీలలో పాల్గొన్న ప్రతిఒక్కరు గెలిచినట్లేనని తెలిపారు.  

ఓవరాల్‌ చాంపియన్‌గా నార్త్‌కోస్టల్‌ జోన్‌

వ్యవసాయ క్రీడా, సాంస్కృతిక పోటీలలో పురుషుల విభాగంలో నార్త్‌కోస్టల్‌ హై ఆల్టిట్యూట్‌ ట్రైబల్‌జోన్‌ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించింది. మహిళల విభాగంలో కృష్ణా జోన్‌ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించింది. సాంస్కృతిక పోటీల్లో కృష్ణాజోన్‌ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించింది. విజేతలకు డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జి.రామచంద్రరావు, వర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగాధిపతి రవికాంత్‌, డీన్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ డాక్టర్‌ యల్లారెడ్డి, పాలకమండలి సభ్యులు డాక్టర్‌ వి.శ్రీనివాసరావు, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ ఎఫైర్స్‌ డాక్టర్‌ ఎస్‌ఆర్‌ కోటేశ్వరరావు, ప్రెసిడెంట్‌ ఆఫ్‌ నాన్‌టీచింగ్‌ స్టాప్‌ కుమారిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:57:29+05:30 IST