పంటల బీమా స్వాహాపై విచారణ

ABN , First Publish Date - 2021-08-28T04:08:40+05:30 IST

పంటల బీమా నిధుల స్వాహా వ్యవసాయ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

పంటల బీమా స్వాహాపై విచారణ
దర్యాప్తుచేస్తున్న డీడీ మురళి, ఏడీ శ్రీనివాసరావు

పోలీసు బందోబస్తు మధ్య అధికారుల దర్యాప్తు

గుంటూరు, వట్టిచెరుకూరు, ఆగస్టు 27: పంటల బీమా నిధుల స్వాహా వ్యవసాయ అధికారులు  దర్యాప్తు చేపట్టారు. వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడులో శుక్రవారం అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య విచారణ నిర్వహించారు. వ్యవసాయశాఖ డీడీ మురళి, ఏడీ శ్రీనివాసరావు, ఏవో లక్ష్మిలు పంటల బీమాలో లబ్దిపొందిన రైతులను పంచాయతీ కార్యాలయానికి  పిలిపించి వివరాలు సేకరించారు. సర్పంచ చందు శ్రీనివాసరావు, ఏఈవో హారిక ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. నిధులు స్వాహాపై గ్రీవెన్సలో ఫిర్యాదులు రాగా కలెక్టర్‌ వివేక్‌, జేడీ విజయభారతి ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు డీడీ మురళి తెలిపారు. చెరుకుపల్లి మండలంలో తమకు పరిహారం అందలేదని, తాము ఎవరికి పొలం కౌలుకు ఇవ్వలేదని రైతులు లిఖితపూర్వకంగా తెలిపినట్లు డీడీ వివరించారు.  


Updated Date - 2021-08-28T04:08:40+05:30 IST