రమ్య హత్యకేసులో నిందితుడిని శిక్షించాలి
ABN , First Publish Date - 2021-09-03T14:33:50+05:30 IST
దళిత సోదరి రమ్యను హత్యచేసిన నిందితుడిని..

తెలుగు యువత జిల్లా నాయకుడు ప్రణీత్
తెనాలిరూరల్: దళిత సోదరి రమ్యను హత్యచేసిన నిందితుడిని దిశ చట్టంకింద 21 రోజుల్లో శిక్షించాలని లేకుంటే తెలుగుయువత ఆధ్వ ర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన లు చేపడతామని తెలుగుయువత జిల్లా నాయకుడు పాలడు గు ప్రణీత్ హెచ్చరించారు. గురువారం తిరుపతిలో 21 రోజుల్లో రమ్య హంతకుడిని శిక్షించాలని గాంధీజీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబును అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ తెనాలి తెలుగుయువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ వద్ద ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రణీత్ మాట్లాడుతూ రమ్య చనిపోయి 17 రోజులు అవుతోందని మహిళలపై అత్యాచారం, హత్య చేసిన దోషులను దిశా చట్టం కింద 21 రోజుల్లో శిక్షిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారన్నారు. దీనిలో భాగంగా తెలుగుయువత అధ్యక్షుడు చినబాబు రమ్య హంతకులను శిక్షించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. దళిత విద్యార్థినిని దారుణంగా హత్యచేసిన హంతకుడిని శిక్షించాలని కోరడం ఈ ప్రభుత్వానికి తప్పుగా అనిపించడం సరికాదన్నారు. తమను ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఉండబోమని ప్రభుత్వ వైఫల్యాలపై పోరా టం ఆపబోమని స్పష్టం చేశారు. తెలుగు విద్యార్థి నియోజకవర్గ అధ్యక్షుడు జితేష్, విద్యార్థినేత పూర్ణ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు గుమ్మడి భార్గవ్, మల్లవరపు ప్రదీప్, అఖిల్, ఇమ్రాన్, జాబివుల్లా, విజయ్, యశ్వంత్, శ్రామణ్, కిట్టు, ప్రవీణ్, పవన్. ఎలిషా, శంకర్, సిల్వర్, జిలాని, ప్రఽశాంత్, కె. శ్రీనివాస్, జగ్గాత్, సాయి, కిరణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.