రోడ్డు ప్రమాదంలో హెచఎం మృతి

ABN , First Publish Date - 2021-10-21T05:01:37+05:30 IST

విధి నిర్వహణకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఓ ప్రధానోపాధ్యాయుడు మృతువాత పడిన ఘటన అనుపాలెం సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో హెచఎం మృతి

మరో ప్రధానోపాధ్యాయుడికి గాయాలు  

రాజుపాలెం, అక్టోబరు20: విధి నిర్వహణకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఓ ప్రధానోపాధ్యాయుడు మృతువాత పడిన ఘటన అనుపాలెం సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వల్లెంశెట్టి శ్రీనివాసరావు(48) కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచఎంగా పని చేస్తున్నారు. అదేవిధంగా కె.శ్రీనివాసరావు  పెదకొదమగుండ్ల  ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ సత్తెనపల్లిలో నివాసం ఉంటూ కారులో రోజూ స్కూలుకు వెళుతుంటారు. అయితే బుధవారం వీరిద్దరూ బైక్‌పై విధులకు బయలుదేరారు. గుంటూరు - మాచర్ల రహదారిపై అనుపాలెం సమీపంలోకి రాగానే హైదరాబాద్‌ నుంచి బెల్లంకొండ వస్తున్న కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ వల్లంశెట్టి శ్రీనివాసరావు మృతిచెందగా కె.శ్రీనివాసరావు  చికిత్స పొందుతున్నారు. రాజుపాలెం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2021-10-21T05:01:37+05:30 IST