మృత్యువులోనూ వీడని బంధం

ABN , First Publish Date - 2021-08-28T04:11:26+05:30 IST

మంగళగిరి బైపాస్‌ రహదారిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు భార్యభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు.

మృత్యువులోనూ వీడని బంధం
ప్రమాదం జరిగిన ప్రదేశం

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

మంగళగిరి, ఆగస్టు 27: మంగళగిరి బైపాస్‌ రహదారిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు భార్యభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. సేకరించిన వివరాలిలా వున్నాయి.. నగరంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామికాలనీకి చెందిన తాడిశెట్టి సురేష్‌(30), అతని భార్య రమణమ్మ(27) పెదకాకానిలో జరుగుతున్న ఓ వివాహనికి హాజరయ్యేందుకు  బైకు మీద బయలుదేరారు. కాలనీనుంచి బైకుపై బయలుదేరిన దంపతులు జనసేన్త రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎదురుగా సర్వీసు రోడ్డు నుంచి హైవే ఎక్కుతుండగా విజయవాడ నుంచి గుంటూరు వైపు వెడుతున్న టాటాఏస్‌ వాహనం వేగంగా వచ్చి వీరి బైకును ఢీకొంది. దీంతో సురేష్‌, రమణమ్మలు బైకు పైనుంచి ఎగిరిపడ్డారు. తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందారు. సురేష్‌ మంగళగిరి అంబేద్కర్‌ సెంటరులో తోపుడుబండిపై సోడాలు అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

 

Updated Date - 2021-08-28T04:11:26+05:30 IST