రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-03-22T05:38:38+05:30 IST

మండలంలోని మంచాల గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సంధ్యారాణి మృతదేహాని పరిశీలిస్తున్నఎస్‌ఐ కిషోర్‌

చేబ్రోలు, మార్చి21: మండలంలోని మంచాల గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది.   పోలీసుల కథనం ప్రకారం.. పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన వేంపాటి సంధ్యారాణి (36) అనే మహిళను  లారీ ఢీ కొంది. తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందింది. ఎస్‌ఐ కిషోర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2021-03-22T05:38:38+05:30 IST