రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2021-08-26T05:21:55+05:30 IST

ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసేందుకు వెళుతూ కుమారుడు, అతని పిన్ని మృతి చెందిన ఘటన బుధవారం గుంటూరులోని మహాత్మాగాంధీ ఇన్నర్‌రింగ్‌రోడ్డులో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

పెదకూరపాడు, ఆగస్టు 25: ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసేందుకు వెళుతూ కుమారుడు, అతని పిన్ని మృతి చెందిన ఘటన బుధవారం గుంటూరులోని మహాత్మాగాంధీ ఇన్నర్‌రింగ్‌రోడ్డులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెదకూరపాడుకు చెందిన మంచి భాగ్యలక్ష్మి అనారోగ్యంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన చేయించుకుంది. ఆమె ఒక్కగానొక్క కుమారుడు తిరుపతిరావు(32)గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మాచర్లలో నివాసం ఉంటున్న ఆమె చెల్లి గడ్డం కుమారి(43) పెదకూరపాడుకు వచ్చింది. ఇద్దరూ కలిసి భాగ్యలక్ష్మిని పరామర్శించేందుకు ద్విచక్రవాహనంపై గుంటూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ వాహనం డివైడర్‌కు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచకి తరలించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎంపీపీ ఎనవీవీఎస్‌ వరప్రసాదు జీజీహెచలో వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  

 

Updated Date - 2021-08-26T05:21:55+05:30 IST