వివాహ వేడుకకు వెళుతూ మృతువాత

ABN , First Publish Date - 2021-05-31T05:32:13+05:30 IST

ట్రాక్టర్‌ ఢీ కొని మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రమైన కాకుమాను శివారు బీకేపాలెం రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది.

వివాహ వేడుకకు వెళుతూ మృతువాత
సంఘటన స్థలంలో మరియమ్మ మృతదే హం

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

కాకుమాను, మే 30: ట్రాక్టర్‌ ఢీ కొని మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రమైన కాకుమాను శివారు బీకేపాలెం రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... వట్టిచెరుకూరు మండల ముట్లూరు గ్రామానికి చెందిన అన్నవరపు మరియమ్మ(45) ఆమె భర్త బాబూరావుతో కలిసి వివాహ వేడుకలకు ద్విచక్ర వాహనంపై పర్చూరు మండలం చెరుకూరు గ్రామానికి వెళుతున్నారు. గురుకుల పాఠశాల సమీపంలో ట్రాక్టర్‌ ఢీ కొట్టడంతో మరియమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి పోస్టుమార్డం అనంతరం కుటుంబసభ్యులకు అందజేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపారు. 


Updated Date - 2021-05-31T05:32:13+05:30 IST