1న ఫ్యాప్టో ర్యాలీ, బహిరంగసభ

ABN , First Publish Date - 2021-08-28T04:57:32+05:30 IST

సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబరు ఒకటో తేదీన గుంటూరులో ర్యాలీ, బహిరంగసభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్‌ సీహెచ్‌ సుధీర్‌బాబు తెలిపారు.

1న ఫ్యాప్టో ర్యాలీ, బహిరంగసభ
పోస్టర్లు విడుదల చేస్తున్న ఫ్యాప్టో నాయకులు

గుంటూరు, ఆగస్టు 27: సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబరు ఒకటో తేదీన గుంటూరులో ర్యాలీ, బహిరంగసభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్‌ సీహెచ్‌ సుధీర్‌బాబు తెలిపారు. గుంటూరులోని ఎస్టీయూ భవన్‌లో శుక్రవారం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామన్న సీఎం మాటను నిలుపుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్‌ కె.బసవలింగారావు, కె.నరసింహారావు, కళాధర్‌, పెదబాబు, నగేష్‌, తిరమలరెడ్డి, రత్తయ్య తదితరులున్నారు. 

    

Updated Date - 2021-08-28T04:57:32+05:30 IST