పురుగులమందు తాగి యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-08T05:20:22+05:30 IST

తల్లిదండ్రులు లేరనే దిగులుతో పురుగులమందు తాగి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరప ఏఎస్‌ఐ జి.ప్రసన్నకుమార్‌ తెలిపిన వివరాల మేరకు...

పురుగులమందు తాగి యువకుడి ఆత్మహత్య

కరప, డిసెంబరు 7: తల్లిదండ్రులు లేరనే దిగులుతో పురుగులమందు తాగి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరప ఏఎస్‌ఐ జి.ప్రసన్నకుమార్‌ తెలిపిన వివరాల మేరకు... కరపమండలం కూరాడ గ్రామానికి చెందిన కొండేపూడి మణికంఠ(24) ఏలేశ్వరం మండలం యర్రవరంలోని ఒక జీడిపిక్కల ఫ్యాక్టరీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన మణికంఠ కూరాడలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. కాగా ఫ్యాక్టరీలో డ్యూటీ ముగించుకుని ఈనెల 4వ తేదీ సాయంత్రం కూరాడ చేరుకున్న మణికంఠ 6వ తేదీ తెల్లవారుజామున పురుగుల మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. క్షతగాత్రుడిని బంధువులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కరప హెడ్‌కానిస్టేబుల్‌ యు.లింగారెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

Updated Date - 2021-12-08T05:20:22+05:30 IST