ఏసుక్రీస్తు లోక రక్షకుడు

ABN , First Publish Date - 2021-12-26T05:21:38+05:30 IST

ఏసుక్రీస్తు లోక రక్షకుడని ఆయన బోధనలు పాప పరిహారానికి మార్గమని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

ఏసుక్రీస్తు లోక రక్షకుడు

మంత్రి కన్నబాబు  

 ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు 

 చర్చిల్లో క్రైస్తవుల ప్రార్థనలు

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 25 : ఏసుక్రీస్తు లోక రక్షకుడని ఆయన బోధనలు పాప పరిహారానికి మార్గమని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వైద్యనగర్‌, రమణయ్యపేటలో ని బెరాకా బ్లెస్సింగ్‌ చర్చి, రేస్‌ ఆఫ్‌ పీస్‌ వర్షిప్‌ చర్చి పాస్టర్లు రెవ జోసఫ్‌ బెన్నీ, రెవ మూర్తిరాజు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని చెప్పారు. సర్పవరంలో జీసస్‌ మినిస్ట్రీస్‌ ఫౌండర్‌ డాక్టర్‌ వెన్నపు ప్రసాద్‌పాల్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించి, సుమారు 500మందికి రగ్గులు, దుప్ప ట్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో జడ్పీటీసీలు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, వైసీపీ నేతలు వడ్డి మణికుమార్‌, జంగా గగారిన్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రీస్తు ఆరాధనతోనే ప్రపంచ శాంతి 

కరప: సర్వమానవాళి శ్రేయస్సు, ప్రపంచ శాంతి క్రీస్తు ఆరాధనతో సాధ్యమని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. నడకుదురు క్రైస్ట్‌ బిలీవర్స్‌, నూతన యెరూసలేం చర్చిల్లో శనివారం జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కేక్‌ కట్‌చేసి సర్వజనులకు పంచిపెట్టారు.  పలువురు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చర్చి ఫాదర్‌లు రెవరెండ్‌ మేడపాటి రాజ్‌కుమార్‌, జె.పాల్‌ప్రసాద్‌ ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రీస్తు సందేశాన్ని వినిపించారు. జడ్పీటీసీలు యాళ్ల సుబ్బారావు, నురుకుర్తి రామకృష్ణ, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మిసత్తిబాబు, ఎంపీటీసీ పైలా రామతులసిగోవిందు, వైసీపీ నాయకులు జవ్వాది సతీష్‌, రెడ్డిపల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. కరప ఫెయిత్‌ గాస్పెల్‌ చర్చిలో బిషప్‌ డాక్టర్‌ కె.అబ్రహంశామ్యూల్‌, శాంతి బాప్టిస్టు చర్చిలో పాస్టర్‌ డి.జయప్రకాష్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మీసత్తిబాబు దుస్తులు పంపిణీ చేశారు. వేళంగి క్రైస్ట్‌ చాపెల్‌ చర్చిలో పాస్టర్‌ పంపన సత్యప్రసాద్‌, ఆర్‌సీఎం చర్చిలో పాస్టర్‌ జాకబ్‌, యండమూరు గాస్పెల్‌ బాప్టిస్టు చర్చిలో రెవరెండ్‌ ఐ.జాన్‌సూర్యప్రకాష్‌, గొడ్డటిపాలెం ఫెయిత్‌ ఫెలోషిప్‌ చర్చిలో పాస్టర్‌ కె.డేవిడ్‌రాజు, మిగిలిన చర్చల్లో పాస్టర్‌ ఆర్కే సాల్మన్‌రాజు, ఆర్‌.ప్రతాప్‌కుమార్‌ తదితరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి పేదలకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు.

భానుగుడి(కాకినాడ): జగన్నాథపురం చర్చి స్క్యేర్‌ ప్రాం తంలోని సెయింట్‌ లూథరన్‌ చర్చి, సెయింట్‌ ఆన్స్‌ చర్చి, ఆర్‌సీఎం చర్చి, రోమన్‌ కేఽథలిక్‌ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాంతిభవన్‌ సెంటర్‌ సమీపంలోని క్రేగ్‌ చర్చి, రామారావుపేట ప్రాంతంలోని ప్రసిద్ధ చర్చిలు భక్తులతో కిక్కిరిశాయి.  పిల్లలకు  కానుకలు బహూకరించారు. రామారావుపేట చర్చిలో ఏర్పాటుచేసిన క్రిస్మస్‌ వేడుకలలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పాల్గొని కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. 

కార్పొరేషన్‌(కాకినాడ): భానుగుడి సమీపంలోని జేకే రెసిడెన్సీలో  క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎండీ కె.ఫణికుమార్‌ కేక్‌ కట్‌చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ పిల్లలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా క్రీస్తు జన్మించిన పశువుల పాక అలంకరణ ఆందరినీ ఆకట్టుకుంది.  

రోగులకు దుప్పట్లు,పండ్లు పంపిణీ

జీజీహెచ్‌ (కాకినాడ):  కాకినాడ జీజీహెచ్‌లో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ సందర్భంగా గ్రీస్‌ మెమోరియల్‌, గ్రేవ్‌ హిమాన్‌యుల్‌ బాప్టిస్ట్‌ చర్చిలతో పాటు జీజీహెచ్‌లో నిరుపేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఫౌండేషన్‌ అధ్యక్షుడు చాట్ల శివగణేష్‌ పప్పారెడ్డి మాట్లాడు తూ 1988బ్యాచ్‌ విద్యార్థులంతా కలసి హెల్పింగ్‌ హ్యాండ్స్‌ను ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.  సామాజిక కార్యకర్త గేదెల శ్రీనివాస్‌, పానుగంటి శ్రీనివాస్‌, కాళ్లకూరి ఆనందరావు, నిమ్మగంటి సత్యనారాయణ, శ్రీనివాసగుప్తా, చిట్టిబాబు పాల్గొన్నారు. 

పిఠాపురం: పట్టణంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ చర్చిల్లో  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అతిపురాతనమైన ఆంధ్రా బాప్టిస్ట్‌ సెంటినరీ చర్చిలో క్రిస్మస్‌ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి కేరల్స్‌ సర్వీస్‌, ఉద యం క్రిస్మస్‌ ఆరాధన జరిగాయి. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రార్థనల్లో పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద గల బేతెస్థ ప్రార్థనా మందిరం, బొజ్జావారితోటలోని  షాలెమ్‌గాస్పెల్‌ మినిస్ట్రీస్‌,  రథాలపేటలోని ఇమ్మా నుయేల్‌ సువార్తసంఘం చర్చి,పెనూయేలు ప్రార్థనామందిరం, ఇందిరానగర్‌, కత్తులగూడెం, మంగాయామ్మరావుపేట తదితర ప్రాం తాల్లోని చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ కార్యాలయంలో క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే దొరబాబు పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ క్రిస్మస్‌ కేక్‌ను కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

పిఠాపురం రూరల్‌: మండలంలోని చిత్రాడ, కుమారపురం, విరవ, విరవాడ, భోగాపురం, రాపర్తి, పి.రాయవరం తదితర గ్రామాల్లోని చర్చిల్లో శనివారం క్రిస్మస్‌ ప్రార్థనలు జరిగాయి.  రాత్రి కేండిల్స్‌తో ప్రదర్శన నిర్వహించారు.  గోకివాడలో ఫాస్టర్‌ జె.థామస్‌ ఆధ్వర్యంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

గొల్లప్రోలు/గొల్లప్రోలురూరల్‌: పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్సు మార్కండేయపురం, పంచాయతీ కాలనీ, గాంధీనగర్‌, కొత్తపేట,  రంగప్పచెరువువీధిలో గల చర్చిల్లో క్రిస్మస్‌ సం దర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని చేబ్రోలులో క్రిస్మస్‌ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో జడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగలోవరాజు పాల్గొన్నారు.

పెద్దాపురం: పట్ణణ, మండల పరిధిలోని గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవ సోదరులు ప్రార్థనా మందిరాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

గండేపల్లి : మండలంలో పలు గ్రామాల్లో శనివారం క్రిస్మస్‌ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల చేశారు.  అనంతరం కొవ్వొత్తులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

కిర్లంపూడి: మండల కేంద్రమైన కిర్లంపూడిలో ఉన్న సేయింట్‌పాల్‌ లూథరన్‌ చర్చ్‌లో క్రిస్మస్‌వేడుకలు ఘనం గా నిర్వహించారు. స్థానిక ఆరాధనా మందిరం దైవ సేవ కులు ఐ.జీవరత్నం పలువురి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్యప్రసంగీకులుగా డాక్టర్‌ రేవా ఇమాన్యుయల్‌, మాసా జాన్‌మాసాలు హాజరయ్యారు. రేవా మూరా శామ్యూల్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలను తెలిపారు. 

సామర్లకోట: సామర్లకోటలో పలు క్రైస్తవ ప్రార్థనామంది రాలలో ఘనంగా క్రిస్టమస్‌ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దవులూరి సుబ్బారావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.అరుణ, వైస్‌చైర్మన్‌ ఊబా జాన్‌ మోజెస్‌లు పాల్గొన్నారు. అనంతరం పలువురు మతగురు వులను సుబ్బారావు సత్క రించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాగా సురేష్‌కుమార్‌ రెడ్డికుమారివాసు, పాలిక కుసుమ తదితరులు పాల్గొన్నారు.  పలు చర్చిలలో పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. సెంటినరీ బాప్టిస్టు చర్చి, ఆంధ్రాబాప్టిస్ట్‌ చర్చి, అగస్తానా లూదరన్‌ చర్చి, షాలేము చర్చి తదితర ప్రార్ధనామందిరాలలో క్రైస్తవ సోదరులు క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్నారు.  సామ ర్లకోటలో ప్రముఖ క్రిస్టియన్‌ కాన్వెంట్‌ పాఠశాలలో క్రీస్తు జననం పశువుల శాలలో జరిగిన నేపఽథ్యాన్ని ప్రతిబింభించేలా విద్యార్థులు నిర్వహించిన అలంకరణ ఆకట్టుకుంది. 

ఏలేశ్వరం: మండలంలోని క్రైస్తవులు ఇళ్లల్లో, ప్రార్ధనా మందిరాల వద్ద విద్యుత్‌ వెలుగులతో క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపేలా క్రిబ్‌లను ఏర్పాటు చేసి క్రీస్తు బోధనలు స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పట్టణంలోని సీవోఎం, లూఽథరన్‌, ఆర్‌సీఎం చర్చిల్లో వందలాదిమంది క్రైస్తవులు కేక్‌లు కోసం ప్రార్ధనలు చేయగా యువతీ, యువకులు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. లింగంపర్తిలోని సెయింట్‌పాల్స్‌ లూథరన్‌ చర్చి వద్ద గుడాల దైవసహాయం, కొండ్రు రాంబాబు, బోండు వీరబాబు, నక్కా రమేష్‌ తదితర సంఘ పెద్దలు నేతృత్వంలో జరిగిన వేడుకల్లో పాస్టర్‌ సీహెచ్‌ డేవిడ్‌రాజు క్రిస్మస్‌సందేశాన్ని భక్తులకు వినిపించారు.

ప్రత్తిపాడు: స్థానిక సెంటినరీ బాపిస్ట్‌ దేవాలయంలో క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. చర్చి కమిటీకి చెందిన ఎస్‌.సుదర్‌సింగ్‌, ఇంజనీర్‌ మోహన్‌, జి.సుందరావు, ఆనంద్‌జోషి ప్రార్ధనలు జరిపారు. ఎంపీపీ జీకే సుధాకర్‌, జడ్పీటీసీ బెహరా రాజరాజేశ్వరి, సర్పంచ్‌ గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం, పీసీసీ సభ్యుడు ధరణాలకోట శ్రీను, వైద్యులు ఏవీ రమణ, పవన్‌కుమార్‌, గ్రామ పెద్దలు ఏడిద రెడ్డినాయు డు, ముత్యాల రాంబాబు, శేరు కృష్ణ, గోళ్ళ శేఖర్‌బాబు, ఎస్‌.మధుబాబు, పినిశెట్టి ప్రకాష్‌ పాల్గొన్నారు. ఆర్‌సీఎం చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ధర్మవరం, ఒమ్మంగి, పెద్దిపాలెం, చింతలూరు, పెదశంకర్లపూడి చర్చిల్లో సర్పంచ్‌ బెంతుకుర్తి సుశీలఅబ్బాయి, పాస్టర్లు ఊబా కృపావరం, వల్లూరి రత్నం, మైలపల్లి సత్యనారాయణ, ప్రభాక ర్‌, దొరబాబు ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. 

నియోజకవర్గీయులు సంతోషంగా ఉండాలి

ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా ఆకాంక్షించారు. పెదశంకర్లపూడిలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన కేక్‌ కట్‌ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాజాకు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు క్రిస్మస్‌ జ్ఞాపిక అందజేశారు. దస్స ప్రసాద్‌, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

కొత్తపల్లి: క్రిస్మస్‌ పండుగ పురస్కరించుకొని నాగులాపల్లిలో సర్పంచ్‌ వడిశెట్టి గౌరీ రాజేశ్వరి, వైసీపీ అధి కార ప్రతినిధి వడిశెట్టి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్లు, చీరలను పంపిణీ చేశారు. ఉప్పాడ, మూలపేట, అమీనబాద్‌, ఇసుకపల్లి గ్రామాల్లో ఏసు ప్రార్ధనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు



Updated Date - 2021-12-26T05:21:38+05:30 IST