అంతా మా ఇష్టం

ABN , First Publish Date - 2021-10-22T05:09:28+05:30 IST

ప్రత్తిపాడులో రహ దారికి అడ్డంగా గురువారం జనాగ్రహ దీక్ష నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు సెంటర్‌ సమీపంలో రోడ్డును మూసివేసి భారీ షామియానాలు వేసి వందలాది కుర్చీలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ జనాగ్రహ దీక్ష చేపట్టారు.

అంతా మా ఇష్టం
రోడ్డుకు అడ్డంగా వైసీపీ దీక్షా శిబిరం

రోడ్డుకు అడ్డంగా వైసీపీ దీక్షా శిబిరం
ప్రత్తిపాడు, అక్టోబరు 21:  ప్రత్తిపాడులో రహ దారికి అడ్డంగా గురువారం జనాగ్రహ దీక్ష నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు సెంటర్‌ సమీపంలో రోడ్డును మూసివేసి భారీ షామియానాలు వేసి వందలాది కుర్చీలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌తో పాటు నియోజకవర్గంలోని నాయకులు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వందలాది మంది కార్యకర్తలతో ఈ జనాగ్రహ దీక్ష కోలా హలంగా నిర్వహించారు. రోడ్డును మూసి జనాగ్రహ దీక్ష నిర్వహించడం వల్ల ప్రభుత్వ కార్యాలయాలకు, ఆసుపత్రికి, పాఠశాలలకు వెళ్లే ప్రజలు, విద్యార్థులు  ఇబ్బందులు పడ్డారు.  శిబిరం కారణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు గ్రామంలోకి రావడానికి వీలు లేకపోవడం వల్ల బైపాస్‌ మీదుగానే నడిపారు.  ప్రత్తిపాడు, కిర్లంపూడి ప్రయాణికులు బైపాస్‌ రహదారిలో సామగ్రితో దిగి స్థానిక కాంప్లెక్స్‌కు చేరుకోవడానికి నానా తిప్పలు పడ్డారు. 

Updated Date - 2021-10-22T05:09:28+05:30 IST