వైసీపీ నేత వేధింపులు.. తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-06-22T13:39:52+05:30 IST

అధికార పార్టీ నాయకుడి వేధింపులు తట్టుకోలేక..

వైసీపీ నేత వేధింపులు.. తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం

భానుగుడి(కాకినాడ): అధికార పార్టీ నాయకుడి వేధింపులు తట్టుకోలేక కాకినాడలో సోమవారం తల్లీకొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రేచర్లపేటకు చెందిన మహిళ కుంచె నాని, కొడుకు ప్రభుతేజతో కలిసి కొన్నేళ్లుగా స్థానికంగా నివాసం ఉంటున్నారు. వీరి ఇంటి ఎదురుగా ఉన్న వైసీపీ నాయకుడు రాజు.. తమ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దీనికి అంగీకరించకపోవడంతో దాడులు చేస్తు న్నారన్నారు ఇదే విషయమై 4రోజుల కిందట జరిగిన గొడవలో రాజు దాడితో ప్రభుతేజ తలకు తీవ్రగాయం అయిందని, తాను సృహ కోల్పోయానని వివరించారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ప్రయత్నించగా, అక్కడ ఎస్‌ఐ తమను దూషించి, మీపై కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారని తెలిపారు. దీంతో తమకు ఆత్మహత్య తప్ప మరోమార్గం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-06-22T13:39:52+05:30 IST