వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు

ABN , First Publish Date - 2021-12-25T06:01:04+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయ్యాయని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు

అమలాపురం టౌన్‌, డిసెంబరు 24: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయ్యాయని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు  ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నా దళిత మంత్రులు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. అమలాపురం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన దళిత నాయ కుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై జరుగుతున్న దాడులను, దుర్మార్గాలను కళ్లు ఉండి చూడలేకపోతున్న దళిత మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండు చేశారు. డాక్టర్‌ సుధాకర్‌తో మొదలుపెట్టి గుంటూరు పెదనంది పాడులో జరిగిన సంఘటనలను ఆయన వివరించారు. సమావేశంలో దళిత నాయకులు కుసుమ సూర్య మోహనరావు, బత్తుల సాయి, గెల్లా మీనాకుమారి, మంద గెద్దయ్య, కాట్రు తారక్‌, కాట్రు శ్రీను, అయితా బత్తుల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2021-12-25T06:01:04+05:30 IST