పరిహారం కోసం మత్స్యకారుల ఆందోళన

ABN , First Publish Date - 2021-11-10T05:24:16+05:30 IST

యానాం నియోజకవర్గం పరిధిలో చమురు సంస్థలు (జీఎస్‌పీసీ, ఓఎన్‌జీసీ) కార్యకలాపాల వల్ల నష్టపోయిన మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం యానాం అగ్నికులక్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 13 గ్రామాల మత్స్యకారులు ఆందోళన చేపట్టారు.

పరిహారం కోసం మత్స్యకారుల ఆందోళన
పరిహారం కోసం మత్స్యకారుల ఆందోళన

యానాం, నవంబర్‌ 9: యానాం నియోజకవర్గం పరిధిలో  చమురు సంస్థలు (జీఎస్‌పీసీ, ఓఎన్‌జీసీ) కార్యకలాపాల వల్ల నష్టపోయిన మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం యానాం అగ్నికులక్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 13 గ్రామాల మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. 2011లో సంస్థ ఎదురుగా సుమారు 113 రోజులు యానాం నియోజకవర్గం మత్స్యకారులు ఆందోళన చేశారు. పరిహారం చెల్లించేందుకు అంగీకరించిన సంస్థ ఐదు నెలలకు రూ.19 కోట్లు చెల్లించి, ఏడు నెలలకు రూ.25.72 కోట్లు  చెల్లించకపోవడంతో మంగళవారం దరియాలతిప్ప జెట్టీ వద్ద యానాం నియోజకవర్గంలోని 13 గ్రామాల మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. అక్కడ నిర్వహిసున్న కార్యకలాపాలను, నావలపై వెళ్లి గోదావరిలో జరుగుతున్న సంస్థ కార్యకలాపాలను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులతో యానాం ఉన్నాతాధికారులు, చమురు సంస్థ అనుబంధ ప్రతినిధులు చర్చించారు. డిమాండ్లను ఉన్న తాధికారులకు నివేదిస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అయితే  డిమాండ్లు పరిష్కరించే వరకూ  ప్రతీ రోజూ ఆందోళన చేస్తామని మత్స్యకారులు హెచ్చరించారు.

Updated Date - 2021-11-10T05:24:16+05:30 IST