యానాంలో ఏప్రిల్‌ 6న ఎన్నికలు

ABN , First Publish Date - 2021-02-27T06:51:33+05:30 IST

పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ 6న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికలసంఘం ఏర్పాట్లు చేస్తుంది.

యానాంలో ఏప్రిల్‌ 6న ఎన్నికలు

యానాం, ఫిబ్రవరి 25: పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ 6న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికలసంఘం ఏర్పాట్లు చేస్తుంది. యానాం నియోజకవర్గంలో ఏప్రిల్‌ 6న ఎన్నికలు నిర్వహించనున్నట్టు పుదుచ్చేరి ఎన్నికల ప్రధానాధికారి సుబ్బిర్‌సింగ్‌ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ వివరాలను ఆయన వెల్లడించారు. మార్చి 12 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 20న నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు అన్నారు. ఏప్రిల్‌ 6న పోలింగ్‌, మే 2న కౌంటింగ్‌ నిర్వహిస్తామని అన్నారు. షెడ్యూల్‌ విడుదలైన వెంటనే (ఇప్పటినుంచే) ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చిందన్నారు. ఈనియామవళి రాజకీయ పార్టీలు, పోటిచేసే ప్రతీఒక్కరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు. 


Updated Date - 2021-02-27T06:51:33+05:30 IST