ఉపాధి పనులపై సామాజిక తనిఖీ

ABN , First Publish Date - 2021-12-28T06:07:00+05:30 IST

రాయవరంలో సోమవారం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంతోపాటు వివి ధశాఖల ద్వారా జరిగిన పనులపై 13,14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ

రాయవరం, డిసెంబరు 27: రాయవరంలో సోమవారం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంతోపాటు వివి ధశాఖల ద్వారా జరిగిన పనులపై 13,14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఎంపీపీ నౌడు వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి పాల్గొని సమీక్షించారు. ఇటీవల మండలంలోని 12గ్రామాల్లో విలేజ్‌ సోషల్‌ ఆడిటర్లు నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌ నివేదికను సమావేశంలో వివరించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.7.82కోట్లతో వివిధశాఖల ద్వారా చేపట్టిన 2,269 పనులు, 2020-21లో రూ.10.67కోట్లతో చేపట్టిన 1898 పనులకు సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిపారు.ఈసందర్భంగా డ్వామాపీడీ అడపా వెంకటలక్ష్మి మాట్లాడుతూ 13వ విడత తనిఖీలో పెనాల్టీ రూపంలో రూ.13,500, నేమ్‌బోర్డుల రికవరీ కింద రూ.8.20లక్షలు, మస్తర్‌ రికార్డుల్లో మస్తర్ల కరక్షన్‌కుగాను ఫీల్డ్‌ అసిస్టెంట్ల నుం చి రూ.10,135 రికవరీకి ఆదేశించడంతోపాటు సెర్ఫ్‌ నుంచి రూ.14,069, రికార్డులు అప్పగించని కారణంగా జరిగిన పనుల్లో వ్యత్యాసాలకు రూ.80వేలు, పశుసంవర్థకశాఖ నుంచి చేపట్టిన పనులకు రికార్డులు అప్పగించని కారణంగా రూ.12.41లక్షలు రికవరీకి ఆదేశించామని, డీఎఫ్‌ నుంచి రూ.28వేలు రికవరీకి ఆదేశించా మన్నారు. 14వవిడత తనిఖీల్లో పెనాల్టీలు, రికవరీ వివరాలు వెల్లడించారు. జడ్పీటీసీ నల్లమిల్లి మంగతాయారు, సర్పంచ్‌లు చంద్రమళ్ల రామకృష్ణ, మల్లిడి సూరారెడ్డి, ఇన్‌ఛార్జ్‌ ఎంపీడీవో హరికృష్ణారెడ్డి, ఏపీడీ జి.శ్రీనివాసరావు, గిరిబాబు, జ్యోతి జేఈ ఈశ్వరప్రసాద్‌, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2021-12-28T06:07:00+05:30 IST