మహిళ స్థానంలో పురుషుడు నామినేషన్‌

ABN , First Publish Date - 2021-02-06T06:43:47+05:30 IST

కొంకుదురు పంచాయతీలో 6వ వార్డు బీసీ మహిళకు కేటాయించగా పురుషుడు నామినేషన్‌ వేయడంతో స్టేజ్‌-1 అధికారి శుక్రవారం పరిశీలనలో తిరస్కరించారు.

మహిళ స్థానంలో పురుషుడు నామినేషన్‌

  • పరిశీలనలో తొలగింపు.. కొంకుదురులో ఘటన

బిక్కవోలు, ఫిబ్రవరి 5: కొంకుదురు పంచాయతీలో 6వ వార్డు బీసీ మహిళకు కేటాయించగా పురుషుడు నామినేషన్‌ వేయడంతో స్టేజ్‌-1 అధికారి శుక్రవారం పరిశీలనలో తిరస్కరించారు. గ్రామంలో 14 వార్డుల్లో 13 వార్డులు ఏకగ్రీవం చేయాలని గ్రామస్థులు ఒక్కొక్కరితోనే నామినేషన్లు వేయించారు. ఇక్కడ మహిళకు బదులు పురుషుడు నామినేషన్‌ వేయడం దానిని తిరస్కరించడంతో ఆవార్డులో పోటీ చేసేవారు లేకుండా పోయారు. దీంతో ఈ వార్డుకు ఎన్నికలు జరగవు. దీనిపై ఎన్నికల సహాయఅధికారి ఎం.అనుపమను వివరణ కోరగా ఆరో వార్డులో నామినేషన్లు లేని విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని, వారి నిర్ణయం మేరకు ఆ వార్డుకు తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలనలో పందలపాకలో ఆరు వార్డులకు, బలభద్రపురంలో ఒక వార్డుకు డూప్లికేట్‌ నామినేషన్లు రావడంతో వాటిని తిరస్కరించారు. అలాగే తొస్సిపూడి, కొమరిపాలెం గ్రామాల్లో ఒక్కొక్క వార్డుకు రికార్డులు సమర్పించని కారణంగా వారి నామినేషన్లను, పందలపాకలో సర్పంచ్‌కు రెండు డూప్లికేట్‌, బలభద్రపురంలో ఒక డూప్లికేట్‌ నామినేషన్‌ రావడంతో వాటిని కూడా అధికారులు తిరస్కరించారని ఎన్నికల అధికారి తెలిపారు.

Updated Date - 2021-02-06T06:43:47+05:30 IST