మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-08-11T04:49:57+05:30 IST

మహిళల రక్షణ, భద్రతకు సీఎం జగన్‌ అధిక ప్రాధాన్యమిచ్చి పటిష్టమైన చట్టాలను అమలు చేస్తున్నారని రాజానగరం ఎమ్మె ల్యే జక్కంపూడి రాజా అన్నారు.

మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం
సదస్సులో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

  • రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
  • అందరితో దిశయాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాలి: అర్బన్‌ ఎస్పీ

దివాన్‌చెరువు, ఆగస్టు 10: మహిళల రక్షణ, భద్రతకు  సీఎం జగన్‌ అధిక ప్రాధాన్యమిచ్చి పటిష్టమైన చట్టాలను అమలు చేస్తున్నారని రాజానగరం ఎమ్మె ల్యే జక్కంపూడి రాజా అన్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలోని కన్వెన్షన్‌ హాల్‌ లో రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్వీ ఐశ్వర్య రస్తోగి అధ్వర్యంలో అర్బన్‌ పోలీ సు జిల్లా పరిధిలోని మహిళా పోలీసు కార్యదర్శులు, కళాశాలల విద్యార్థినులకు మంగళవారం దిశయాప్‌పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే జక్కంపూడి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని ఉపయోగించుకునేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంద న్నారు. ఈ నెల 15వ తేదీ లోపు రాజానగరం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో దిశయాప్‌ డౌన్‌లోడ్‌ చేయించిన ముగ్గురికి నగదు బహుమతులను ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. అర్బన్‌ ఎస్పీ మాట్లాడుతూ దిశ ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే వెనువెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితు లకు అండగా నిలుస్తారన్నారు. దిశ చట్టం, యాప్‌ మహిళలకు గొప్ప ఆయుధా లని, అందరితో దిశయాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాలని కోరారు. దిశ చట్టం, యాప్‌ విశిష్టతపై అనేక విషయాలను వివరించారు. అర్బన్‌ జిల్లాలో నేరాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 15 రోజులుగా నిర్వహించిన దాడుల్లో బహిరంగంగా మద్యం తాగుతున్న వ్యక్తులపై 1500కు పైగా కేసులు నమోదు చేశామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నెంబర్‌ ప్లేట్లు ఉన్న పది వేల ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించామన్నారు. అడిషనల్‌ ఎస్పీ లతా మాధురి మాట్లాడుతూ అర్బన్‌ జిల్లా పరిధిలో ఇంతవరకూ 1,70,000 మంది దిశయాప్‌ డౌన్‌లోడ్‌ చేశారన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ పాపారావు, సీడబ్ల్యుసీ చైర్మన్‌ పద్మావతి, డీఎస్పీలు ఏటీవీ రవికుమార్‌, సంతోష్‌, శ్రీలత, కడలి వెంకటేశ్వరరరావు, సీఐలు ఎంవీ సుభాష్‌, కె.లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాను, ఎస్పీ ఐశ్వర్యరస్తోగిలను నన్నయ వర్శిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే రాజాకు వివరించారు.

Updated Date - 2021-08-11T04:49:57+05:30 IST