మద్యం షాపు తొలగించకపోతే కార్యాలయం ముట్టడి

ABN , First Publish Date - 2021-12-08T06:13:58+05:30 IST

గూడాల పంచాయతీ పరిధి తాడికోన రోడ్డులో మద్యం దుకాణం తొలగించాలని లేకపోతే ఎక్సైజ్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తా మని సర్పంచ్‌, గ్రామస్తులు హెచ్చరించారు.

మద్యం షాపు తొలగించకపోతే కార్యాలయం ముట్టడి

అల్లవరం, డిసెంబరు 7: గూడాల పంచాయతీ పరిధి తాడికోన రోడ్డులో  మద్యం దుకాణం తొలగించాలని లేకపోతే ఎక్సైజ్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తా మని సర్పంచ్‌, గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామస్తుల ఆందోళన మంగళ వారం 8వ రోజు  కొనసాగింది. మద్యం షాపు తొలగించాలని ఎక్సైజ్‌ అధికా రుల వైఖరి మారాలంటూ నినాదాలు చేశారు. సర్పంచ్‌ సాధనాల సూర్యవెం కటనాగమణి, మాజీ సర్పంచ్‌ దాసరి అప్పలస్వామి, సాధనాల నాగబాబు, శిరంగు వీరబాబు, సాధనాల వెంకట్రామారావు, దాసరి సత్తి బాబు, సుంకర కొండ, చెరుకూరి అమ్మాజీ, పిల్లా వెంకటలక్ష్మి, వేమ దుర్గ, అధిక సంఖ్యలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. మద్యం షాపు తొలగించాలని మంత్రి పినిపే విశ్వరూప్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. Updated Date - 2021-12-08T06:13:58+05:30 IST