గెలుపోటములు సహజం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-10-14T06:34:48+05:30 IST

పోటీలో గెలుపు, ఓటములు సహజమని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ అన్నారు. 13రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి రగ్బీ ఆటల పోటీలు బుధవారంతో ముగిసాయి.

గెలుపోటములు సహజం: ఎమ్మెల్యే

ముగిసిన రాష్ట్ర స్థాయి రగ్బీ ఆటల పోటీలు

విజేతగా కర్నూలు జట్టు, రన్నర్‌గా తూర్పు 

తాళ్లరేవు, అక్టోబరు 13: పోటీలో గెలుపు, ఓటములు సహజమని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ అన్నారు. 13రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి రగ్బీ ఆటల పోటీలు బుధవారంతో  ముగిసాయి. ఈసందర్భంగా ఏరాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 13జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్లో కర్నూలు జట్టు విజయం సాధించగా తూర్పుగోదావరి జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కామాడి గోవలక్ష్మిమాతరాజు, ఎంపీపీ రాయుడు సునీతగంగాధర్‌, వైసీపీ కన్వీనర్‌ కాదా గోవిందకుమార్‌, పీఈటీ నాగలింగేశ్వరరావు, కోరింగ సర్పంచ్‌ పెయ్యల మంగేష్‌, ఎంపీటీసీలు, నాయకులు, పీఈటీలు పాల్గొన్నారు.   Updated Date - 2021-10-14T06:34:48+05:30 IST