ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-08-10T05:45:34+05:30 IST

స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌-2022 ప్రక్రి య కింద ఓటరు జాబితాల సవరణకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్‌ తెలిపారు.

ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌

కాకినాడ సిటీ, ఆగస్టు 9: స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌-2022 ప్రక్రి య కింద ఓటరు జాబితాల సవరణకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్‌ తెలిపారు. ఈ నెల 9 నుంచి అక్టోబరు 31 వరకు జాబితాలలో మల్టిఫుల్‌ ఎంట్రీలు, లాజికల్‌ ఎర్రర్ల తొలగింపు, బూత్‌ లెవెల్‌ అధికారులతో ఇంటింటి పరిశీలన, సెక్షన్ల ఫార్మేషన్‌, పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ తదితర ప్రీ రివిజన్‌ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. 2021 న వంబరు 1న ముసాయిదా జాబితాలను ప్రచురించి, నవంబరు 1 నుంచి 30 వరకు వాటిపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీక రించనున్నట్లు చెప్పారు. రివిజన్‌ సందర్భంగా ముఖ్య ఎన్నికల అధికారి సూచించిన తేదీలలో స్పెషల్‌ క్యాంపెయిన్‌ డేస్‌ నిర్వహిస్తారని తెలిపారు. డిసెంబరు 20 నాటికి క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై పరిష్కారాలను పూర్తి చేసి, 2022 జనవరి 5న తుది ఓటరు జాబితాలను ప్రచురించనున్నట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-08-10T05:45:34+05:30 IST