పశుసంవర్థక శాఖ ఉపసంచాలకుడిగా డాక్టర్‌ మూర్తి

ABN , First Publish Date - 2021-06-22T06:19:45+05:30 IST

అమలాపురం డివిజన్‌ పశుసంవర్థకశాఖ ఉపసంచాలకుడిగా డాక్టర్‌ కర్నీడి మూర్తి స్థానిక కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

పశుసంవర్థక శాఖ  ఉపసంచాలకుడిగా డాక్టర్‌ మూర్తి

అమలాపురం టౌన్‌, జూన్‌ 21: అమలాపురం డివిజన్‌ పశుసంవర్థకశాఖ ఉపసంచాలకుడిగా డాక్టర్‌ కర్నీడి మూర్తి స్థానిక కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముమ్మిడివరం ఏరియా పశువైద్యశాలలో తొమ్మిదేళ్లుగా సహాయ సంచాలకునిగా పనిచేసిన మూర్తి పదోన్నతిపై అమలాపురం ఉపసంచాలకుడిగా నియమితులయ్యారు.  ఈసందర్భంగా డాక్టర్‌ మూర్తి మాట్లాడుతూ ఔత్సాహిక పాడిరైతులతో కామనగరువులో దేశీయ ఆవుజాతి ఫారాన్ని రూ.30లక్షలతో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.  డివిజన్‌ పరిధిలోని సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎల్‌.డాక్టర్‌ శ్రీరామ్‌కిరణ్‌, డాక్టర్‌ ఎ.కావ్య, డాక్టర్‌ పూర్ణిమానాగలక్ష్మి తదితరులు పాల్గొని మూర్తికి దుశ్శాలువాలు కప్పి అభినందించారు.


Updated Date - 2021-06-22T06:19:45+05:30 IST