వీరేశ్వరస్వామి కార్తీక ఆదాయం రూ.49 లక్షలు

ABN , First Publish Date - 2021-12-08T06:07:52+05:30 IST

మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి కార్తీకమాసం నెలరోజుల ఆదాయం రూ.49,01,043 వచ్చినట్టు ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు.

వీరేశ్వరస్వామి కార్తీక ఆదాయం రూ.49 లక్షలు

ఐ.పోలవరం, డిసెంబరు 7: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి కార్తీకమాసం నెలరోజుల ఆదాయం రూ.49,01,043 వచ్చినట్టు ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. గత ఏడాదికంటే ఈఏడాది సుమారు రూ.24లక్షలు ఆదాయం అదనంగా వచ్చిందన్నారు. కార్తీకమాసంలో సేవలం దించిన ఆలయ సిబ్బందికి చైర్మన్‌ పెన్మెత్స కామరాజు, ఈవో  లక్ష్మీనారాయణ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ కఠారి శ్రీనివాసరాజు, జూనియర్‌ అసిస్టెంట్‌ జగతా చిట్టిబాబు, అర్చకులు యనమండ్ర సుబ్బారావు, పేటేటి శ్యామలకుమార్‌, వేదపండితులు గంటి సుబ్రహ్మణ్యశాస్త్రి, స్వస్తివాచకులు నాగాభట్ల రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. 

బాలబాలాజీ స్వామి ఆదాయం రూ.39 లక్షలు

మామిడికుదురు, డిసెంబరు 7: అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారికి 69రోజులకు రూ.39,27,588 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమి షనర్‌ పి.బాబూరావు తెలిపారు. మంగళవారం ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ కార్య నిర్వహణాధికారి డి.సాయిబాబు పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్యిం చారు. 19.600గ్రాములు బంగారం, 140గ్రాముల వెండి వచ్చిందన్నారు. చైర్మన్‌ పిచ్చిక చిన్నా, స్థానిక సర్పంచ్‌ గెడ్డం మంగాలక్ష్మి, ఎంపీటీసీ బొంతు నీలిమ, పీఏసీఎస్‌ చైర్మన్‌ గెడ్డం కృష్ణమూర్తి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-08T06:07:52+05:30 IST