వైభవంగా వేణుగోపాలస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-06-22T06:17:18+05:30 IST

శ్రీవేణుగోపాలస్వామి దివ్యకల్యాణ మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా వేణుగోపాలస్వామి కల్యాణం

ఆత్రేయపురం, జూన్‌ 21: శ్రీవేణుగోపాలస్వామి దివ్యకల్యాణ మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆల యంలో  వేంచేసి ఉన్న వేణుగోపాలస్వామి నవనీత అలంకరణలో కొలువుదీరారు. ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయంలోని వేణుగోపాలస్వామివారి ఆల యంలో స్వామి కల్యాణోత్సవ పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి రెండు ఆలయాల్లో మేళతాళ మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య వేదపండితులు, అర్చకస్వాములు వైభవంగా వేణుగోపాలస్వామి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈవోలు ముదునూరి సత్యనారాయణరాజు, కృష్ణచైతన్య స్వామివార్ల కల్యాణాలు నిర్వహించారు. ఈనెల 25వ తేదీ వరకు లోకకల్యాణార్థం కరోనావ్యాధిని నివారించాలనే సంకల్పంతో స్వామివారికి ఏకాంతపూజలు నిర్వహించనున్నారు.Updated Date - 2021-06-22T06:17:18+05:30 IST