వెంకన్న ఆదాయం రూ.2,36,479
ABN , First Publish Date - 2021-03-15T06:12:05+05:30 IST
వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనం పోటెత్తారు. వివిధ ప్రాంతాలనుంచి భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
ఆత్రేయపురం, మార్చి 14: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనం పోటెత్తారు. వివిధ ప్రాంతాలనుంచి భక్తులు స్వామిని దర్శించుకున్నారు. తలనీలాలు, కానుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిమంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి ఒక్కరోజు ఆదాయం రూ.2,36,479 లభించినట్టు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.84,116
వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి అన్నప్రసాద ట్రస్టుకు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన రాజోలు సురేష్, కనకదుర్గ దంపతులు రూ.34వేలు, రాజమహేంద్రవరానికి చెందిన మల్లిశెట్టి నాగదుర్గలక్ష్మీచలపతిరావు, దీప దంపతులు రూ.50,116 విరాళం సమర్పించారు.
నిత్యాన్నదానానికి రూ.36వేల విరాళం
మామిడికుదురు, మార్చి 14: అప్పనపల్లి బాలబాలాజీస్వామి నిత్యాన్న దాన పథకానికి కాకినాడ వాస్తవ్యులు మల్లుభొట్ల వీఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, అరుణ దంపతులు రూ.36వేలు విరాళంగా అందచేశారు. ఆదివారం వివిధ ఆర్జిత సేవల ద్వారారూ.1,49,658ఆదాయం వచ్చిందని సహాయ కమిషనర్ తెలిపారు.