నారుమడులను పరిశీలించిన శాస్త్రవేత్తలు
ABN , First Publish Date - 2021-07-25T05:28:17+05:30 IST
వేగివారిపాలెంలో నారుమడులను పెద్దాపురం ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎ.సీతారామశర్మ, శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.నాగేంద్రబాబు శనివారం పరిశీలించా రు.

రాజోలు: వేగివారిపాలెంలో నారుమడులను పెద్దాపురం ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎ.సీతారామశర్మ, శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.నాగేంద్రబాబు శనివారం పరిశీలించా రు. వర్షాలకు ముంపునకు గురైన నారు మడులను పరి శీలించి ముంపునీటిని బయటికి మళ్లించాలని సూచించారు. మండల వ్యవసాయశాఖాధికారి ఎస్. ప్రశాంత్‌కుమార్‌లు, వీఏఏలు, సహాయ వ్యవసాయ సంచాలకులు పాల్గొన్నారు.
యాజమాన్య పద్ధతులపై అవగాహన
మామిడికుదురు: నారుమడుల్లో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై పొలంబడి కార్యక్రమంలో భాగం గా ఉద్యానవన సహాయకులకు శిక్షణా కార్యక్రమాన్ని శని వారం నిర్వహించారు. వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్ మా ట్లాడుతూ నారు చివరలు తుంచి నాటాలన్నారు. కార్యక్ర మంలో ఏఈవో పి.కృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యమైన దిగుబడులు సాధించాలి
ఆత్రేయపురం: మండలంలోని లొల్ల లాకులవద్ద శనివారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయాధికారిణి బి.మృదుల ఆధ్వర్యంలో వ్యవసాయ సహాయకులు, ఉద్యానవన సహాయకులతో శిక్షణ నిర్వహించారు. కార్యక్రమం ద్వారా రైతులకు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు పొందే అంశాలను వివరించారు.
ప్రభుత్వ సంక్షేమాలను సద్వినియోగం చేసుకోవాలి
అల్లవరం: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుభరోసా, ఉచిత పంటల బీమా, కౌలు రైతులకు పంటసాగు హక్కు పత్రాలు సంక్షేమాలు ప్రతిరైతుకు అందాలని రాష్ట్ర అగ్రిమిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు అన్నారు. వ్యవ సాయ గ్రామ సహాయకులు, ఉద్యాన సహాయకులకు అల్లవరం మండల పరిషత్ కార్యాలయంలో పొలంబడి, ఉద్యానశాఖ పథకాలపై శనివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిబ్బందికి క్షేత్రస్థాయిలో పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండ ల వ్యవసా యాధికారి ఎన్‌వీవీ సత్యనారాయణ, ఉద్యానశాఖ సహాయ కులు ఎన్.మల్లికార్జునరావు, ఉద్యానశాఖ అధికారిణి కటకం సత్యశైలజ, ఇరిగేషన్ ఏడీ అజయ్ కుమార్, వ్యవసాయ, ఉద్యాన సిబ్బంది పాల్గొన్నారు.